హైదరాబాద్ జట్టుకు భారీ షాక్

వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. తొడకండరాల గాయం కారణంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోయిన సుందర్.. ఢిల్లీతో మ్యాచ్‌లో మాత్రం అటు బౌలింగులోను, ఇటు బ్యాటింగులోనూ రాణించాడు.ఆ మ్యాచ్‌లో సుందర్ నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇందులో డేవిడ్ వార్నర్ వంటి బిగ్ వికెట్‌తోపాటు సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్ కూడా అతడి బాధితులుగా మారారు. ఆ తర్వాత బ్యాటింగులోనూ సత్తా చాటాడు. 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇందులో మూడు బౌండరీలు ఉన్నాయి.
ఇప్పుడు గాయం కారణంగా ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇప్పటి వరకు సుందర్ ఏడు మ్యాచ్‌లు ఆడి 60 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీసుకున్నాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews