ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

భారత యువ షూటర్‌ నామ్యా కపూర్‌.. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కొల్లగొట్టింది. సోమవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో 14 ఏండ్ల నామ్య.. 36 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన కెమిల్లె జెస్కీ 33 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా.. భారత స్టార్‌ షూటర్‌ మనూ బాకర్‌ 31 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన మరో షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మనూ బాకర్‌, రిథమ్‌ సాంగ్వాన్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. నామ్య ఆరో ప్లేస్‌తో తుదిపోరుకు చేరింది. ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్‌ 16 పతకాల (7 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు)తో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews