ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

ముస్లింల యొక్క అతి పెద్ద పండగ రంజాన్ సందర్భంగా కొడంగల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శనివారం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పరమత సహనాన్ని, మతసామరస్యాన్ని, ఆధ్యాత్మికతను చాటే పవిత్రమైన పండుగ రంజాన్ అని అన్నారు. మైనారిటీల అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రగతి కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచాయని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఈ వేడుకల్లో కొడంగల్ నియోజకవర్గం మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews