ఈటెల చెప్పేవి పచ్చి అబ్బద్దలు, భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేద్దాం దమ్ముందా ?? -రేవంత్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. అయితే రాజకీయ పరిశీలకులు దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలలో ఒకటిగా దీన్ని పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ఆఫర్ చేశారని ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేతులు కలుపుతాయనీ ఆ రెండు పార్టీల డ్రామాలను తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఈటెల ఆరోపించారు.

సింగరేణి కాలిరీస్ టిఎస్ఆర్టిసిని ముందుగా పటిష్టం చేయాలని సలహా ఇచ్చిన బిజెపి ఎమ్మెల్యే ఈటల విశాఖ స్టీల్ప్లాంట్కు బదులుగా స్థానికులకు విలువైన ఉపాధిని అందించే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • రేవంత్ రెడ్డి కౌంటర్

కాంగ్రెస్ కు రూ.25 కోట్లు ఇచ్చిన మాట ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ ఆరోపణలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించారు. కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ నుంచి తాము డబ్బులు తీసుకోలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలు సమకూర్చినదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్థిక సాయం చేశారని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు. బీజేపీ విశ్వసించే భాగ్య లక్ష్మీ ఆలయంలో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు తాను వచ్చి ప్రమాణం చేస్తానని.. ఏ ఆలయంలోనైనా తడిబట్టలతో ప్రమాణం చేయడానికి రెడీ అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews