2000 నోటు మార్పు పై కీలక ఆదేశాలు

రెండు వేల నోట్ల‌ను ఆర్బీఐ వెన‌క్కి తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ క‌రెన్సీ నోట్ల‌ను వాప‌స్ ఇచ్చేందుకు డిపాజిట్‌దారులు బ్యాంకుల‌కు పోటెత్తాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. సెప్టెంబ‌ర్ 30 త‌ర్వాత కూడా 2వేల నోటు చెలామ‌ణి అవుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పుడే బ్యాంకుల‌కు పోటెత్తాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంద‌ని ఆయ‌న అన్నారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీనే ఎందుకు డెడ్‌లైన్‌గా పెట్టామ‌న్న విష‌యాన్ని ఆయ‌న చెబుతూ.. ఆ తేదీని సీరియ‌స్‌గా తీసుకుని ప్ర‌జ‌లు ఆ నోట్ల‌ను వెన‌క్కి ఇచ్చేస్తార‌న్న ఉద్దేశంతో ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించారు.నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించిన త‌ర్వాత ఏర్ప‌డిన లోటును పూడ్చేందుకు రెండు వేల నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆర్బీఐ చీఫ్ తెలిపారు. 2వేల నోట్ల‌ను వెన‌క్కి తీసుకునేందుకు కావాల్సిన అన్ని వ‌స‌తుల్ని బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. అవ‌స‌ర‌మైన‌న్ని ఇత‌ర డినామినేష‌న్ల క‌రెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న నోట్ల క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఆ నోట్లు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టికే ఆ నోట్ల‌ను ప్రింట్ చేసిన‌ట్లు చెప్పారు.2వేల నోట్ల‌ను తీసుకువ‌చ్చిన ఉద్దేశం పూర్తి అయ్యింద‌ని, ప్ర‌స్తుతం స‌ర్య్కులేష‌న్‌లో కావాల్సిన‌న్ని నోట్లు ఉన్నాయ‌న్నారు. ఎప్పుడో రెండు వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసిన‌ట్లు చెప్పారు. ఆ నోట్ల జీవిత కాలం ముగిసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. నోట్లు తీసుకోవ‌డానికి డెడ్‌లైన్ విధించ‌కుంటే, అప్పుడు అది అంతులేని ప్ర‌క్రియ‌గా కొన‌సాగుతుంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews