గాంధీ భవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవు -జగ్గారెడ్డి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీ ఫై మరో లేఖ రాసారు. గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని, పార్టీలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని పేర్కొన్నారు. నేను ఎవరి పేర్లు తీసుకోదల్చుకోలేదని వెల్లడించారు. ఇది మీడియా కి చెప్పడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పారీ నాయకులకు ,కార్యకర్తలకు , అభిమానులకు, ఓటర్లకు సమాచారం ఉండాలనే నా ఆవేదన తెలియచేశానని లేఖ విడుదల చేశారు.నిన్న బుధువారం కూడా ఓ లేఖ రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గతంలోలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ప్రశాంతత కరవైందని పేర్కొన్నారు. తన మనసులో ఎన్నో ఆవేదనలు మసులుతున్నాయని, కానీ వాటిని చెబితే ఏమవుతుంది… చెప్పకుంటే ఏమవుతుందో అనే ఆందోళన ఉందన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ ఇష్టం తోనే ఇంకా పార్టీలో కొనసాగుతున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews