ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో దాదాపు అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆర్థికకలాపాలతోపాటు క్రీడా రంగంపై కరోనా పంజా విసిరింది. ఈ వైరస్ కారణంగా పలు అంతర్జాతీయ టోర్నమెంట్స్ వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది జరగాల్సిన ఐసిసి టీ20 వరల్డ్ కప్ కూడా 2022లో వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటనపై సందిగ్దత నెలకొంది. అయితే, టీమిండియా పర్యటనపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా క్రికెట్ ఆస్ట్రేలియా పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డే సిరీస్‌లు ఆడనున్నట్లు సీఏ స్పష్టం చేసింది.
టీ20 సిరీస్అక్టోబర్ 11న బ్రిస్బేన్‌లో తొలి టీ20, అక్టోబర్ 14 కాన్‌బెర్రాలో రెండో టీ20, అక్టోబర్ 17 అడిలైడ్ లో మూడో టీ20
టెస్టు సిరీస్
బ్రిస్బేన్‌లో డిసెంబర్ 3-7వరకు తొలి టెస్టు, అడిలైడ్ లో డిసెంబర్ 11-15వరకు రెండో టెస్టు, మెల్‌బోర్న్ లో డిసెంబర్ 26-30వరకు మూడో టెస్టు, సిడ్నీలో జనవరి 3-7వరకు నాలుగో టెస్టు.
వన్డే సిరీస్
జనవరి 12న పెర్త్‌లో తొలి వన్డే, జనవరి 15న మెల్‌బోర్న్‌లో రెండో వన్డే, జనవరి 17న సిడ్నీలో మూడో వన్డే.