టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ భవిత్యవం ఐపీఎల్ 2020పైనే ఆధారపడి ఉంది. ధోనీ అంతర్జా తీయ క్రికె ట్‌కు దూరమై ఏడాది గడిచిపో యింది. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పరాభవం తరు వాత ధోనీ జట్టుకు దూరమ య్యాడు. ఈక్రమంలో ఐపీఎల్‌లో రాణించి జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించినా ఈ టోర్నీ నిర్వహణపై బీసీసీఐ ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. మరోవై పు ఐపీఎల్ తాజా ఎడిషన్ ఖచ్చితంగా ఈ ఏడాది ఉంటుందని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్‌పై అతడి మేనేజర్ మిహిర్ దివాకర్ స్పందించాడు. మీడియాతో మిహిర్ మాట్లాడుతూ ధోనీకి రిటైర్మెంట్ ఆలోచనలు లేవని, ఐపీఎల్‌లో ఆడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడని తెలిపాడు. ఐపీఎల్ కోసం చెన్నైలో సాధన కూడా మొదలుపెట్టాడని లాక్‌డౌన్ కారణంగా ఆగిపో యిందని తెలిపాడు. చెన్నైలో ధోనీతోపాటు అతడి సహచరులు సురేశ్‌రైనా, అంబటి రాయుడుతో కలిసి కఠోర సాధన చేశాడని మిహిర్ వివరించాడు. లాక్‌డౌన్ సమయంలో ఫిట్‌నెస్ కోసం తన ఫామ్‌హౌస్‌లో నిరంతరం కృషి చేస్తున్నాడని, లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తరువాత మళ్లిd సాధన ప్రారం భిస్తాడని ధోనీ మేనేజర్ మిహిర్ వెల్లడించాడు.