సచిన్ ను ఔట్ చేస్తే చంపుతామన్నారు

క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ను ఔట్‌ చేసిన సమయంలో చంపేస్తామనే బెదిరింపులు ఎదురయ్యాయని ఇంగ్లండ్‌ పేసర్‌ టిమ్‌ బ్రెస్నన్‌ వెల్లడించాడు. అం తర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ 99 శతకాలు చేసిన అనంతరం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుందని అతడు పేర్కొన్నాడు.  2011లో  ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో 91 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బ్రెస్నన్‌ బౌలింగ్‌లో సచిన్‌ ఔటయ్యాడు. అయితే వాస్తవానికి బంతి లెగ్‌స్టంప్‌ను దాటివెళ్తున్నట్లు రిప్లేలో తేలినా.. అప్పటికే బ్రెస్నన్‌ అప్పీల్‌ చేయడం అంపైర్‌ వేలెత్తడం జరిగిపోయాయి. ‘ఆ మ్యా చ్‌లో సచిన్‌ 91పై బ్యా టింగ్‌ చేస్తున్న సమయంలో నేను వేసిన బంతి ప్యా డ్‌కు తాకింది. అప్పీలు చేయగానే అంపైర్‌ టకర్‌ ఔటిచ్చాడు. అయితే ఆ తర్వాత నాతో పాటు అంపైర్‌కు బెదిరింపులు ఎదురయ్యా యి. చంపేస్తామనే హెచ్చరికలు కూడా వచ్చాయి. ఈ ఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాత నేను ఆ అంపైర్‌తో కలిశాను. ఈ అంశంపై చర్చించగా.. ఆ రోజు నుంచి  సెక్యూరిటీ గార్డును నియమించుకున్నానని అంపైర్‌ చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం నా వంతైంది’ అని బ్రెస్నన్‌ చెప్పుకొచ్చాడు. 

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews