అన్ని రకాల కొవైడ్ టెస్టుల తర్వాతే మైదానంలోకి

వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్‌-13 లీగ్‌ ఆరంభంకానుంది. యూఏఈ వెళ్లడానికి ముందే లీగ్‌లో పాల్గొనే సిబ్బంది, ఆటగాళ్లందరికి వారం ముందే రెండు కొవిడ్‌-19 పరీక్షలు తప్పనిసరి చేశారు. ఐతే యూఏఈలో 6 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని ఐపీఎల్‌ పాలక మండలి నిబంధనలో ఉన్నది. అలా కాకుండా డాక్టర్ల సలహాలు, సూచనలతో కేవలం 3 రోజులకే పరిమితం చేయాలని ఫ్రాంఛైజీలు బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్‌ చేరుకున్నాక ఆటగాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేందుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు అంగీకరించాయి. ఐపీఎల్‌ జట్టు యజమానుల సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ‘ఆరోగ్య సమస్యలపై ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేం. జట్టు సభ్యులందరూ తప్పనిసరిగా ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని’ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ అధికారి తెలిపారు. దుబాయ్‌ ప్రభుత్వ ప్రొటోకాల్‌ ప్రకారం ఆ దేశానికి బయలుదేరే ముందు 96 గంటల్లో పీసీఆర్‌ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.అక్కడికి చేరుకున్నాక మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలిన వారు 14 రోజుల పాటు నిర్భంధంలో ఉండాల్సి ఉంటుంది. ఆ దేశంలోకి ప్రవేశించగానే యూఏఈ కోవిడ్‌-19 టెస్టింగ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ALHOSN యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అన్ని జట్లు కూడా ఆగస్టు 20 తర్వాత దుబాయ్‌ బయలుదేరాలనుకుంటున్నాయి. యూఏఈలో ఏర్పాటు చేసుకున్న క్యాంప్‌ల్లో బసచేస్తాయి.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews