గంగూలీ కెప్టెన్సీలో.. 2003 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి పోయింది. 2019లో విరాట్ నేతృత్వంలోని టీమిం డియా.. సెమీస్‌లో కివీస్ చేతిలో పరాజయం పాలైం ది. ఈ విషయమై మాజీ సారథి గంగూలీ.. తాజాగా మయాంక్ అగర్వాల్‌తో మాట్లాడాడు. 2019 జట్టు లోని ఏ ముగ్గురు ఆటగాళ్లను.. 2003 జట్టులో తీసుకుం టారు… అని గంగూలీకి ఓ అభిమాని ప్రశ్న అడిగాడు. దీనికి గంగూలీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మతో పా టు పేసర్ జస్ప్రిత్ బుమ్రాను ఎంచుకున్నాడు. బుమ్రా మం చి ఫాస్ట్ బౌలర్ అని, రోహిత్‌ను టాప్ ఆర్డర్‌లో పంపేందుకు తీసుకుంటానని, తాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి న తరువాత కోహ్లీని పంపుతానని చెప్పాడు. ఈ ముగ్గురిని కాకుండా నాల్గో ప్లేయర్ తీసుకో వాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేస్తారని ప్రశ్నించగా.. వెంటనే ధోనీ అని గంగూలీ సమాధానం చెప్పాడు. ద్రావి డ్‌ను కూడా తీసుకొని కీపర్ బాధ్యతలప్పగిస్తానని, ఎం దుకంటే 2003 ప్రపంచ కప్ లో రాహుల్ ఎంతో బాగా కీపి ంగ్ చేశాడని గుర్తు చేశాడు.టీ20 క్రికెట్‌కు తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని, అయితే ఈ ఫార్మాట్‌లో డిమాండ్‌లను తీర్చడానికి కృషి చేస్తానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. టీ20 చాలా ముఖ్యమైందని, తాను కూడా ఆటను మార్చుకున్నట్టు వివరించాడు. ఇది స్వింగింగ్‌కి.. హిట్టింగ్‌కు లైసెన్స్ లాంటిందని అభిప్రాయపడ్డాడు. మాజీ సారథి గంగూలీ.. 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టీ20 ప్రవేశపెట్టే సమయానికి గంగూలీ.. కెరీర్ చివర్లో ఉంది. పూణ వారియర్స్‌కు మారే ముందు.. ఐపీఎల్ ఫ్రాంచైజ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.