రాహుల్ ద్రావిడ్ కు ఫిదా అయిపోయా -సురేష్ రైనా

మైదానంలో వ్యూహాలు రచించడంలో ద్రవిడ్‌ సిద్ధహస్తుడని సురేష్‌రైనా అన్నాడు. 2006లో భారత్‌-పాక్‌ మధ్య జరిగిన వన్డేలో ఆ జట్టు ఓపెనర్‌ కమ్రాన్‌ అక్మల్‌ను అద్భుతమైన వ్యూహంతో ద్రవిడ్‌ బోల్తాకొట్టించాడని తెలిపారు. ద్రవిడ్‌ రచించిన ఆ వ్యూహానికి తాను ఫిదా అయ్యానని రైనా అన్నాడు. ఏబీపీ న్యూస్‌ వేదికగా లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌తో నిర్వహించిన లైవ్ సెషన్‌లో ఈ విషయాలు చెప్పుకొచ్చాడు.
‘2006 భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో నేను పట్టుకున్న క్యాచ్‌ నాకింకా గుర్తుంది. అప్పుడు రాహుల్‌ ద్రవిడే మా కెప్టెన్‌. ఇర్ఫాన్‌ పఠాన్‌ బౌలింగ్‌. ఆ సమయంలో ద్రవిడ్‌ చెప్పిన స్థానంలోనే నేను ఫీల్డిండ్‌ చేస్తున్నాను. ఇర్ఫాన్‌ వేసిన బంతిని బ్యాటింగ్‌ చేస్తున్న అక్మల్‌ బలంగా కొట్టాడు. ఆ బంతి నేరుగా వచ్చి నా చేతుల్లో పడింది. ద్రవిడ్‌ చెప్పినట్టుగా క్యాచ్‌ రావడంతో తన చాకచక్యానికి నేను ఫిదా అయ్యాను’ అని రైనా గత అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 41 ఓవర్లలో 161 పరుగులు చేసిన పాకిపస్థాన్‌పై భారత్‌ 32 ఓవర్లలోనే విజయం సాధించిందని చెప్పాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews