కరోనా లాక్‌డౌన్‌తో వాయిదాపడిన పదోతరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలను వాయిదావేయాలని ఆదేశించింది.
అయితే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, అందులో పాసైన వారిని కూడా రెగ్యులర్‌గా పాసైనట్లు గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.