బ్యాంకుల్లో ఉద్యోగాలు కొద్దిగా కష్టపడితే కచ్చితంగా సాధించవచ్చు

రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఆఫీసర్ స్కేల్ II, III పోస్టులకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ www.ibps.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు యాక్టీవ్‌లో ఉన్న ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు వివరాలు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు సమయంలో పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, అడ్రస్, క్వాలిఫికేషన్ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో Apply online for CRP RRBs IX లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో వేర్వేరు లింక్స్ ఉంటాయి. మీరు అప్లై చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన లింక్ క్లిక్ చేయాలి. మళ్లీ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ వివరాలు ఎంటర్ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ‘Final Submit’ పైన క్లిక్ చేయాలి. చివరగా పేమెంట్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews