భారత క్రికెట్‌పై మాజీ సారధి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రభావమే ఎక్కువగా ఉందని వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏమీలేని స్థాయి నుంచి భారత జట్టును గంగూలీ తయారుచేశాడని, అందువల్లే భారత్‌కు ప్రపంచకప్ అందించిన ధోనీకన్నా దాదా ప్రభావమే ఇండియన్ క్రికెట్‌పై ఎక్కువ ఉందని పార్థివ్ చెప్పాడు. 2000 సంవత్సరం తర్వాత గంగూలీ కెప్టెన్ అయ్యాడని గుర్తుచేసిన పార్థివ్.. అప్పుడు భారత క్రికెట్ చాలా కష్టాల్లో ఉందని చెప్పాడు. ‘అలాంటి సమయంలో జరిగిన 2003 ప్రపంచకప్ గురించి మాట్లాడుకోవాలి. ఆ టోర్నీలో భారత్ ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించలేదు’ అని పార్థివ్ పేర్కొన్నాడు.