గంగూలీ ధోని ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో గ్రేమ్ స్మిత్ మాటల్లో ..

భారత జట్టు మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్​ ధోనీల్లో బెస్ట్ ఎవరు అనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఓ సర్వేలో అతి తక్కువ మెజార్టీతో ధోనీ సారథ్యమే అత్యుత్తమం అనే ఫలితం వచ్చింది. కాగా ఈ విషయంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్​ గ్రేమ్ స్మిత్ తాజాగా స్పందించాడు. ధోనీ, గంగూలీ కెప్టెన్సీ మధ్య తేడా ‘ధోనీ’నే అని బుధవారం ఓ టీవీషోలో కొత్త కోణాన్ని చెప్పాడు.
“దాదా, ధోనీ కెప్టెన్సీ మధ్య పెద్ద తేడా.. ఆటగాడిగా ధోనీ లేకపోవడమే. మిడిల్​ ఆర్డర్​లో ధోనీ లాంటి మ్యాచ్​ను ముగించే ప్లేయర్​, మ్యాచ్ విన్నర్​ గంగూలీ కెప్టెన్​గా ఉన్నప్పుడు టీమ్​ఇండియాలో లేడు. ఇద్దరు హీరోల కెప్టెన్సీలో నాకు ఇదే తేడా కనిపించింది. ఒకవేళ దాదా జట్టులోనూ ఎంఎస్ లాంటి ప్లేయర్ ఉండిఉంటే.. భారత జట్టు మరింత బాగా ఆడేది. మరిన్ని ట్రోఫీలు గెలిచేది. టెస్టు క్రికెట్ విషయానికి వస్తే నేను గంగూలీతోనే మాట్లాడతా. వన్డే క్రికెట్​లో ధోనీనే నా ఫేవరెట్” అని క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. 2004లో గంగూలీ కెప్టెన్​గా ఉన్నప్పుడే భారత జట్టులోకి ధోనీ అరంగేట్రం చేశాడు. అయితే ఆ తర్వాత గంగూలీ కెప్టెన్సీ ఎక్కువ రోజులు నిలువలేదు. కాగా గంగూలీ వేసిన పునాది వల్లే ధోనీ సారథ్యంలో భారత జట్టు గొప్ప విజయాలు సాధించిందని మాజీ ఓపెనర్​ గౌతమ్ గంభీర్​ ఇటీవల అభిప్రాయపడ్డాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews