కెప్టెన్ గా రాహుల్ కు గుర్తింపు దక్కలేదు – గౌతమ్ గంబీర్

భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు చేసి న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు.. అందుకు తగిన కీర్తి ప్రతిష్టలు దక్కలేదని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఎంత గొప్పగా సారథ్యం వహించినా.. ద్రవిడ్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదని అన్నాడు. భారత క్రికెట్‌పై సచిన్‌తో సమానంగా ద్రవిడ్‌ ప్రభావం చూపాడని సోమవారం ఓ టీవీ షోలో గౌతీ అన్నాడు.జట్టుకు దూకుడు నేర్పిన గంగూలీ, కెప్టెన్‌ కూల్‌గా ముద్రపడ్డ ధోనీ మధ్య కాలంలో భారత్‌కు నాయకత్వం వహించిన ద్రవిడ్‌ అంతగా వెలుగులోకి రాలేకపోయాడని గంభీర్‌ అన్నాడు. జట్టు అవసరాల కోసం పాటుపడే ది వాల్‌ కెప్టెన్సీలో జట్టు అనితర సాధ్యమైన విజయాలను సొంతం చేసుకుందన్న గంభీర్‌ వ్యాఖ్యలు అతని మాటల్లోనే ‘దురదృష్టవశాత్తు ద్రవిడ్‌ కెప్టెన్సీని మనం తగిన రీతిలో కీర్తించలేకపోయాం. కేవలం గంగూలీ, ఎంఎస్‌ ధోనీ..ఇప్పుడు విరాట్‌ కోహ్లీ గురించే మాట్లాడుతున్నాం. కానీ రాహుల్‌ అద్భుతమైన సారథి. చాలా రికార్డులు అతడి సొంతం. తక్కువ కీర్తి, ప్రశంసలు పొందిన క్రికెటర్‌గా, కెప్టెన్‌గా ద్రవిడ్‌ ఉన్నాడు. అతడి సారథ్యంలో మనం ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించాం. వరుసగా 14, 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించాం. గంగూలీ ఎక్కువ దూకుడుగా ఉంటాడు కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్‌పై అతడి ప్రభావం ఎక్కువ. అయితే భారత క్రికెట్‌లో మొత్తంగా ద్రవిడ్‌ ప్రభావమే అధికం. సచిన్‌తో సమానంగా భారత క్రికెట్‌పై ద్రవిడ్‌ ముద్ర ఉంటుంది’ అని గంభీర్‌ చెప్పాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews