గత కొన్ని రోజులుగా చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలగొన్నాయి.తూర్పు లడక్ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా మరియు భారత్ తమ తమ స్థావరాలకు పెద్ద మొత్తమున భారీ యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయి. ఈరోజు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో చేసిన వాక్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి . ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి . వీటి అన్నిటిని కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం ఇరు దేశాలు ఏకాభిప్రాయం కుదిరేలా ప్రయత్నాలు చేస్తాము అని జావో తెలిపారు .ఇప్పటికే భారత్ లో చైనా పై భారీ వ్యతిరేకత వస్తుంది, చైనా కి సంబందించిన వస్తువులను కానీ మరేదయినా సరే వాడకూడదు అని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది .