పీల్చే గాలికి కూడా GST వేస్తారా ?? కేంద్ర ప్రభుత్వం పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

మోడీ సర్కారు తీరు చూస్తుంటే భవిష్యత్తులో పీల్చే గాలి పైన కూడా జీఎస్టీ వేస్తారేమో అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేసారు. కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పప్పు, ఉప్పు . పాల ఫై GST పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆందోళనలు చేపట్టాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో అన్ని జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నేతలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలిపారు.మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాడి రైతులు, మహిళల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న పాడి రైతుపై కేంద్రం దుర్మార్గంగా పన్నుల భారం మోపడం అన్యాయమన్నారు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు మరియు పాల ఉత్పత్తుల పైన పన్ను విధించడం వల్ల ఈ రంగంపై పూర్తి ప్రభావం పడుతుందని వాపోయారు.ఓవైపు పాడి రైతుపై భారం వేస్తూనే, పాలు పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం ద్వారా సామాన్యుడు ఎలా బ‌తకాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దేశంలోని ప్రజలు బతకాల వద్దా… అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీరు చూస్తుంటే భవిష్యత్తులో పీల్చే గాలి పైన కూడా జీఎస్టీ వేస్తారేమోనని భయంగా ఉందని శ్రీనివాస్ గౌడ్ వాపోయారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews