మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా… సినీ న‌టుడు మంచు మ‌నోజ్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. ప‌లు సూచ‌న‌లు చేశాడు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని వివ‌రించాడు. ‘నాకు క‌రోనా నిర్ధార‌ణ అయింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన వారు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నాను. దీనిపై అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నా గురించి బాధ‌పడ‌కండి.. నేను ప్ర‌స్తుతం బాగానే ఉన్నాను.. మీ ప్రేమ, ఆశీర్వాదాలే అందుకు కార‌ణం. వైద్యులు, న‌ర్సులంద‌రికీ నేను కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను’ అని మంచు మ‌నోజ్ పేర్కొన్నాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews