త్రిపాత్రా అభినయంలో సుదీర్ బాబు , టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’ లో త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. దుర్గ- స్థూలకాయుడు, పరశురాం- ఓల్డ్ డాన్, డిజె .. ఇలా మూడు భిన్నమైన పాత్రల పోస్టర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.ఈరోజు ఈ సినిమా టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. టీజర్‌లో సుధీర్‌బాబు మూడు పాత్రలు, వాటి క్యారెక్టరైజేషన్ ని పరిచయం చేసేలా ఉంది. దుర్గ జీవితంలో గర్ల్‌ఫ్రెండ్ కావాలని తపిస్తుంటాడు, డిజే ఏవో కారణాల వలన అమ్మాయిలను వద్దనుకుంటాడు. పరశురామ్ ఈ ఇద్దరిని చంపాలనుకునే డెడ్లీ ఓల్డ్ డాన్. టీజర్ అసాధారణంగా అదే సమయంలో వినోదాత్మకంగా ఉంది.సుధీర్ బాబు మూడు పాత్రల మధ్య వైవిధ్యాన్ని అద్భుతంగా చూపించాడు. డీజేగా తెలంగాణ స్లాంగ్‌లో డైలాగులు చెబుతూ అలరించారు. మిర్నాళిని రవి, ఈషా రెబ్బా గ్లామరస్ గా కనిపించారు. హర్షవర్ధన్ యూనిక్ కథతో పాత్రలను ఆకట్టుకునేలా ప్రజంట్ చేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews