బలగం మూవీ కలెక్షన్స్ అదుర్స్

హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో నటుడు ప్రియదర్శి కొత్త చిత్రం ‘బలగం’ తెరపైకి వచ్చి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 26.69 కోట్లు వసూళ్లు చేసింది.వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.
‘బలగం’ కలెక్షన్స్ :::::
నైజాం – 18.38 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ + సీడెడ్ – 8.15 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 26.69 కోట్లు (12.40 కోట్ల షేర్)

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews