సచిన్ కు మేమిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అదే -కోహ్లీ

ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యమి చ్చే విరాట్ .. ఒకప్పుడు ప్యాకెట్ల ప్యాకెట్ల చాక్లెట్లు తినేసే వాడట. తన ముందు ఎలాం టి ఫుడ్ పెట్టినా లాగించేసేవాడట. అంతేకాక మ్యాచ్ కు ముందే బౌలర్లను పూర్తిగా స్టడీ చేస్తానని, దాని వల్లే ఫీల్డ్ లో డామినేట్ చేస్తున్నానని తెలిపాడు. ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్’ పేరిట యువ బ్యాట్స్ మన్ మయాంక్ అగర్వాల్ నిర్వహించిన చాట్ షోలో కోహ్లీ పలు అంశాలపై మాట్లాడాడు. 2011వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన తర్వాత సచిన్ ను భుజానికెత్తుకున్న ఫోటో ఎప్పుడు చూసినా సరే గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము వరల్డ్ చాం పియన్స్ . ఆ టైమ్ లో తెలియకుండానే జట్టంతా సచిన్ దగ్గరకే చేరింది. ఎందుకంటే సచిన్ కు అది లా స్ట్ చాన్స్ అని అందరికీ తెలుసు. పాజీ (సచిన్ ) దేశానికి ఎంతో చేశాడు. అలాంటి వ్యక్తికి మేమిచ్చి న బెస్ట్ గిఫ్ట్ ఆ వరల్డ్ కప్ .

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews