రంజీ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ను డకౌట్ చేసిన ఏకైక బౌలర్ ఇప్పుడు టాప్ బౌలర్, మొదటి జీతం ఎంతో తెలుసా

ప్రపంచ బెస్ట్ బౌలర్లలో భువనేశ్వర్ ఒకడు. బీసీసీఐలోని ఏ-గ్రేడ్ బౌలర్ల జాబితాలో కూడా భువికి స్థానం ఉంది. ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ క్రికెటర్‌గా భువి తొలి సంపాదన ఎంతో తెలుసా..? కేవలం రూ.3000. అదే అప్పట్లో తనకెంతో గొప్పగా అనిపించిందని భువి చెబుతున్నాడు. ఇటీవల ట్విటర్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు గాను భువనేశ్వర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. లాక్‌డౌన్ కారణంగా సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతున్నారు. భువి కూడా ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ‘మీ తొలి జీతం ఎంత..?’ అని భువీని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ‘నేను మొదట రూ.3000 చెక్ తీసుకున్నాను.నేను వాటితోనే షాపింగ్ చేశాను. అంతేకాకుండా వాటిలో కొంత డబ్బును మిగిల్చాను కూడా..’ అంటూ భువి చెప్పాకొచ్చాడు. ఇదిలా ఉంటే 2012లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20తో భువి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అంతేకాకుండా రంజీల్లో టెండుల్కర్‌ను సైతం డక్ ఔట్ చేసిన ఏకైక బౌలర్‌‌గా కూడా భువీ ఘనత వహించాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews