బౌలర్లను ఎలా వాడాలో ధోనీకి బాగా తెలుసు – ఇర్ఫాన్ పఠాన్

ప్రపంచకప్‌ విజేత మాజీ కెప్టెన్‌ ధోనీ 2007లో సారథ్యం వహించినపుడు బౌలర్లను నియంత్రించేవాడని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెల్లడించాడు. 2007 ప్రపంచకప్‌ విజేత జట్టు, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన జట్టులో ధోనీ కెప్టెన్సీ లో పఠాన్‌ ఆడాడు. అనంతరం కెప్టెన్‌గా ధోనీ చాలా మారాడని తెలిపాడు. 2007లో మొదటిసారి జట్టును నడిపించే బాధ్యత తీసుకున్నపుడు ధోనీ ఎంతో ఉత్సా హంగా ఉండేవాడని పఠాన్‌ స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్ట్‌లో తెలిపాడు. 2007, 2013లో జట్టు కేవలం ఐదు నిమి షాలు మాత్రమే సమావేశమయ్యేదని ఇర్ఫాన్‌ తెలిపాడు.2007లో యువధోనీ కెప్టెన్‌గా సహచర క్రికెటర్లను అదుపులో ఉంచేందుకు ప్రయత్నించేవాడు. వికెట్‌ కీపింగ్‌ నుంచి బౌలింగ్‌ వరకు అంతా తన అధీనంలో ఉంచుకునేందుకు ఇష్టపడేవాడని తెలిపాడు. అయితే 2013 నుంచి బౌలర్లకు స్వేచ్ఛనిచ్చేవాడు. బౌలర్లే స్వయంగా నియంత్రణలో ఉండేలా చూసుకునేవాడు. అనంతరం స్లోబౌలర్లు, స్పిన్నర్లపై నమ్మకం పెంచుకున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పూర్తిగా విశ్వసించాడు. కీలక సమయంలో స్పిన్నర్లను దింపి వికెట్లు తీసేలా చూసేవాడు. కాగా ధోనీ సారథ్యంలోనే టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించింది. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. 2010, 2016 ఆసియాకప్‌లు కూడా ధోనీ భారతజట్టుకు అందించాడు. 2007 నుంచి 2016వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో, 2008నుంచి 2014వరకు టెస్ట్‌ క్రికెట్లో దేశానికి టీమిండియాకు ధోనీ సారథ్యం వహించాడు.38ఏళ్ల ధోనీ గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత భారతజట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌ నిరవధికంగా వాయిదాప డటంతో ధోనీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఈ సంవత్సరం ప్రారంభంలో క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు 35ఏళ్ల ఇర్ఫాన్‌ ప్రకటించాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews