చైనాకి బయపడమని భారత్ ఎప్పుడో చెప్పింది చైనా జాగ్రత్తగా ఉండాలి

గల్వాన్‌ లోయలో ఇండో-చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో అమెరికన్‌ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు మార్కో రూబియో భారత్‌కు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. బీజింగ్‌కు భయపడేది లేదని భారత్ స్పష్టం చేసిందని, అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో మాట్లాడి స్పష్టం చేశానన్నారు. ఈ ఘటనపై మార్కో రూబియో ఇదివరకే చైనాను లక్ష్యంగా చేసుకొని పలు ఆరోపణలు చేశారు. జూన్ 15 న గల్వాన్ లోయలో భారతీయ, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఇందులో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులైన సంగతి తెలిసిందే.
గల్వాన్‌లో చైనా ఘర్షణకు పాల్పడినట్లు మరో సెనేటర్ మిచ్ మెక్‌కానెల్ వారంలోనే రెండోసారి ఆరోపించారు. భారత్‌పై చైనా దూకుడుగా వ్యవహరించిందని చెప్పారు. అంతకుముందు, సెనేటర్ టామ్ కాటన్ చైనా హింసాత్మక వైఖరిని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. జపాన్ భూభాగాల్లోకి జలాంతర్గామి చొరబాట్లు చేయడం ద్వారా భారత్‌తో హింసాత్మక ఘర్షణలను చైనా తిరిగి ప్రారంభించిందని అర్కాన్సాస్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్ టామ్‌ కాటన్‌ అన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews