పాకిస్థాన్లో ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని స్టాక్ మార్కెట్ ఆఫీస్ పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రనేడ్ దాడి తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరుపుకుంటూ కార్యాలయంలోకి ప్రవేశించిన నలుగురు తీవ్రవాదులను భద్రతా దళాలు హతమార్చినట్లు తెలుస్తోంది. మిలిటెంట్ల కాల్పుల్లో గాయపడిన పోలీస్ అధికారి, సెక్యూర్టీ గార్డుతోపాటు కొంతమందిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సింధ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముస్తాక్ మహర్ తెలిపారు.