సెన్సిబుల్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన శేఖర్ కమ్ముల ఇటీవలి కాలంలో ఫిదా అనే చిత్రంతో అందరిని ఫిదా చేశాడు. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే శేఖర్ కమ్ముల తదుపరి ప్రాజెక్ట్ కన్‌ఫాం అయింది. లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.లవ్ స్టోరీ సినిమా రిలీజ్ తర్వాత పట్టాలెక్కనున్న శేఖర్ కమ్ముల చిత్రంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్ర పోషించనున్నాడని తాజా సమాచారం. శేఖర్ కమ్ముల స్టైల్లో సాగే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు.ఈ మూవీ గురించి మిగతా విషయాలు త్వరలో తెలియజేస్తారు.ఇదిలా ఉంటే వెంకటేష్ ప్రస్తుతం నారప్ప అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అసురన్ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుంది.