ప్రముఖ నటి సమంత బిగ్‌బాస్-4
హోస్ట్ గా చేయనున్నారని టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ లలో ఆమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో బుల్లి తెరపై సమంత మెరిసే అవకాశం ఉందని, బిగ్‌బాస్-4
కు హోస్ట్ గా చేసేందుకు ఆమె అంగీకరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ మూడు సీజన్లు జరిగాయి. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్ టిఆర్, రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని, మూడో సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరించారు. అయితే మూడో సీజన్ లో ప్రముఖ నటి రమ్యకృష్ణ రెండు రోజుల పాటు హోస్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్-4
సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించేందుకు సమంతను స్టార్ మా టివి యాజమాన్యం సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్-4
హోస్ట్ గా వ్యవహరించేందుకు ఆమె అంగీకరించినట్టు సమాచారం. అయితే వెండితెరపై రాణించిన సమంత బుల్లితెరపై కూడా తన హవాను చాటే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.