శాంతి,అహింస ముఖఃము భూములు కావు -నితిన్ గడ్కరీ

పాకిస్థాన్‌, చైనా భూములు భారత్‌కు అవసరం లేదని, శాంతి ఒక్కటే కావాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. గజరాత్‌లో ఆదివారం నిర్వహించిన జన సంవేద్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. పాక్‌, చైనా దేశాలతోపాటు భూటాన్, బంగ్లాదేశ్‌ మన దేశానికి పొరుగు దేశాలుగా ఉన్నాయని గడ్కరీ చెప్పారు. అయినప్పటికి భూటాన్, బంగ్లాదేశ్‌ భూములను ఆక్రమించేందుకు భారత్‌ ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు. అలాగే పాక్‌, చైనా భూములు కూడా భారత్‌కు అవవసరం లేదన్నారు. శాంతి, అహింస మాత్రమే భారత్‌కు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. భారత్‌, చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో నితిన్‌ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక కరోనా గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ సంక్షోభం మరెంతో కాలం ఉండబోదన్నారు. మన శాస్త్రవేత్తలతోపాటు ఇతర దేశాల్లోని శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్‌ కోసం రాత్రనక, పగలనక కష్టపడుతున్నారని గడ్కరీ చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews