ఏ విషయంపై అయినా బోల్డ్‌గా మాట్లాడటం రాంగోపాల్‌వర్మ స్టయిల్. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఉత్సాహం పొందేందుకు బూతు సినిమాలు చూస్తానని గతంలో ప్రకటించారీయన. ఈయన ఏం మాట్లాడినా టాలీవుడ్‌లో సెన్సేషన్ అవుతుంది. ఈయన మాట్లాడుతుంటే కొసవరకు వింటూనే నవ్వుకొనేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి దర్శక నిర్మాత ఓటీటీ ద్వారా మియా మాల్కోవా నటించిన తన కొత్త సినిమా ‘క్లైమాక్స్’ను ప్రమోట్ చేస్తూ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీరామారావు, రాంచరణ్‌తో రాజమౌళి తీస్తున్న భారీ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫెయిలైతే టాలీవుడ్‌లో సంబురాలు చేసుకొనేవారు ఎందరో ఉన్నారని చెప్పి సెన్సెషన్ క్రియేట్ చేశారు. అంతవరకు రాజమౌళి విజయాల గురించి మాట్లాడకుండా.. ఆయన అపజయంపై తమ కోపమంతా ప్రదర్శిస్తారని చెప్పారు. తెలుగు చిత్రపరిశ్రమ ఐక్యంగా ఉందంటూ నేను మాట్లాడటమంటే పూర్తిగా అబద్ధాలు చెప్పడమే అన్నారు.
‘సినిమావాళ్లు నిజజీవితంలో కూడా నటిస్తారు. వృత్తిపరమైన అసూయ అన్నిచోట్లా ఉంటుంది. అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం మరింత ఎక్కువగా ఉన్నది. ఇతరుల అపజయాలను చూసి కొందరు సంతోషిస్తుంటారు. వాళ్లవాళ్ల ప్రైవేట్ స్పేస్‌లలో ఎంజాయ్ చేస్తుంటారు’ అని చెప్పుకొచ్చారు.
ఆన్‌లైన్ థియేటర్‌లో తదుపరి నాగ్నమ్ అనే సినిమాను విడుదల చేయనున్నాను. సెన్సార్‌షిప్ గురించి మాట్లాడేందుకు, థియేటర్లలో సినిమాలు ప్రదర్శించేందుకు అనువైన సమయంలో ఈ సినిమాకు ప్లాన్ చేశానని, ఇంటర్నెట్ యుగంలో మాత్రం అసంబద్ధమే అని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం అనడంతో నాకు చేయడం వచ్చిన పని సినిమా తయారీ, కాబట్టి సినిమాల నిర్మాణం పనిలోనే ఉన్నానన్నారు.