రాజా అని మీరు పిలిచే పిలుపుతో …

ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్‌, దివంగత డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా రామానాయుడుని గుర్తు చేసుకున్నారు. సినిమా పట్ల ఆయన తపన ఎంతో గొప్పదని,అది ఇతరులను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రామానాయుడుతో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ తనతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు.
రాజా …!” అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసాను. కారంచేడు నుంచి ఓ కుర్రాడు, దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు…నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణం.సినిమా అంటే మీకున్న ప్రేమ,మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews