భారత్, చైనాలో విస్తృతంగా పరీక్షలు జరిపితే.. అమెరికాలో కన్నా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయట పడతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మెయిన్ నగరంలో ఓ మెడికల్ ప్రోడక్ట్స్ కంపెనీని సందర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అధికంగానే ఉంది. జాన్స్ హాప్కిన్స్ నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 1.9 మిలియన్ కరోనా కేసులు, 1,09,000 మరణాలు సంభవించాయి. మరోవైపు భారతదేశంలో 2,36,657 కరోనా కేసులు, 6,642 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ మొదట కనుగొనబడిన చైనాలో 84,177 కేసులు, 4,638 మరణాలు నమోదయ్యాయి.