సినీ కార్మికులకు సహాయం చేసిన హాస్య నటుడు అలీ

సినీ కార్మికులకు ప్రముఖ హాస్యనటుడు అలీ సాయమందించారు. జుబేదాతో కలిసి నిత్యావసర వస్తువులను అందించారు. టాలీవుడ్ లోని 24 శాఖల్లో పని చేసే వారు కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోయి అవస్థలు పడుతున్నారని, ఈ క్రమంలోనే వారికి సాయం చేయాలన్న ఆలోచనతో తనకు తోచినరీతిలో రెండు లక్షల విలువైన పదికిలోల బియ్యం, నూనె, గోధుమపిండి, చక్కెరతో పాటు 8 రకాలైన సరుకులను అందించినట్టు అలీ తెలిపారు. గతేడాది కూడా అలీ పలువురు సినీ కార్మికులను ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో అలీ సోదరులు , నటులు ఖయ్యూం, కరీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews