మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు భారీ కానుక ఇవ్వబోతున్న కుమార్తె సుస్మిత

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేయనున్నారట ఆయన పెద్ద కుమారై సుస్మిత. ఈ నెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అప్పుడే సందడి ప్రారంభించేశారు. సోషల్ మీడియాలో పుట్టినరోజు రికార్డుల దుమ్ము దులపాలని అభిమానులు రెడీ అయిపోయారు. మరోవైపు చిరు తాజా చిత్రం ‘ఆచార్య’టీమ్ అభిమానుల కోసం ఓ కానుకను రెడీ చేసింది. ఇంకోవైపు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా అభిమానులకు గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్’ పేరుతో ఆమె ఒక ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆమె ఒక వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా వెబ్ సిరీస్ కు సంబంధించిన వీడియోను ఆమె విడుదల చేయబోతున్నారట.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews