ఇక పై పోలీసులపై ఆర్మీ పై ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీయరాదు రాష్ట్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి -కేంద్రం

ఇకపై సినిమాల్లో బ్యాడ్ పోలీసులు కనిపించరట. ఇండియన్ సినిమాల్లో పోలీస్ పాత్రలు చాలా రెగ్యులర్ గా కనిపిస్తాయి. అయితే ఎక్కువ సినిమాల్లో పోలీసులను రౌడీలుగా లంచగొండిలుగా చూపిస్తూ ఉంటారు. ఇకపై అలా చూపించేందుకు వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇండియన్ ఆర్మీ గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు సినిమా తీయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ ఆర్మీపై సీన్స్ ఉన్నా కథలో భాగంగా ఇండియన్ ఆర్మీని చూపించినా జవాన్ ల గురించి చిత్రీకరించినా రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. అలాగే పోలీస్ లపై సినిమాలు తీసినా కూడా ఇకపై రాష్ట్ర హోం శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. పోలీసుల గురించిన ఎలాంటి సీన్స్ వ్యతిరేకంగా లేవు అంటూ ప్రభుత్వంకు తెలియజేసి నో అబ్జెక్షన్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే సెన్సార్ నుండి క్లియరెన్స్ వస్తుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ వెబ్ సిరీస్ .. ఇతర వీడియోల్లో కూడా పోలీసులను తప్పుగా రౌడీలుగా చూపించకూడదు. అన్నింటికి కూడా అనుమతులు తీసుకోవాల్సిందే. వెబ్ సిరీస్ ల్లో పోలీసుల గురించి తప్పుగా చూపించినా కూడా మేకర్స్ పై కేసు నమోదు చేయవచ్చు. పోలీసులను హీరోల చేతిలో దెబ్బలు తినేట్లుగా చూపించడంతో పాటు అవినీతి పరులుగా చూపించే మేకర్స్ కొన్ని సినిమాల్లో పోలీసులను హీరోలుగా కూడా చూపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై పోలీసులు సినిమాల్లో హీరోలుగా మాత్రమే కనిపిస్తారు. విలన్స్ గా పోలీసులను చూపించాలంటే చాలా పెద్ద తతంగం ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో పోలీసులను ఫిల్మ్ మేకర్స్ తప్పుగా చూపించే అవకాశం ఉండదు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews