మరోసారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మరోసారి పోలీస్ గెటప్ప్ లో కనిపించనున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో.. పవన్ కల్యాణ్ మరో సినిమా చేయనున్నారన్న వార్త ఇటీవల అధికారికంగా వచ్చింది. దాంతో అప్పటి నుంచీ ఈ సినిమా ఏ తరహా కథాంశంతో రూపొందుతోందన్న కుతూహలం అభిమానుల్లో నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ‘గబ్బర్ సింగ్’ లానే ఇది కూడా పోలీస్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందుతుందట. దీనికి సంబంధించిన కథ ఇప్పటికే పూర్తయిందనీ, ప్రస్తుతం పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో దర్శకుడు హరీశ్ ఉన్నాడట. ఇందులో పవన్ కల్యాణ్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన స్టయిల్ లో చూపించే విధంగా ఆ పాత్రను హరీశ్ డిజైన్ చేస్తున్నాడట. ఏమైనా, ఈ చిత్రంపై ఇప్పటి నుంచే అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాలలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews