కరోనా సోకకుండా ఉండేందుకు ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్‌లను ప్రజలు వాడుతున్న సంగతి తెలిసిందే. కూరగాయలు, నిత్యావసర వస్తువులను శానిటైజ్ చేయడానికి శానిటైజర్ స్ప్రేలు కూడా యూజ్ చేస్తున్నారు. వైరస్ దేనికి ఉంటుందో తెలియదు కాబట్టి చేతులను కడుక్కోవడంతోపాటు కొనే వస్తువలు, తాకే వాటిని శానిటైజ్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కోవలో ఒక వ్యక్తి తన దగ్గర భారీ మొత్తంలో ఉన్న డబ్బును స్ప్రేలు, శానిటైజర్ బాటిల్స్‌తో శుభ్రపరచడం వీలు కాదనుకున్నాడేమో.. ఏకంగా వాషింగ్ మిషన్‌ను ఈ పని కోసం వినియోగించాడు.సౌత్ కొరియాకు చెందిన సదరు వ్యక్తి సియోల్‌కు దగ్గర్లోని అన్సాన్ సిటీలో ఉంటున్నాడు. అతడి వద్ద ఉన్న లెక్కలోకి రాని 50 వేల (42 వేల యూఎస్ డాలర్లు) వొన్ బిల్స్‌ను వాసింగ్ మెషిన్‌లో వేశాడు. కరోనా భయంతో డబ్బులను కడగడం కోసం వాషింగ్ మెషిన్‌లో వేయడంతో చాలా మొత్తం డబ్బు పాడైంది. దీంతో ఆ డబ్బును ఎక్సేంజ్ చేస్తారో లేదో తెలుసుకోవడం కోసం సదరు వ్యక్తి బ్యాంక్ ఆఫ్ కొరియాకు పరుగెత్తాడు. అదృష్టవశాత్తూ ఆ బ్యాంక్ రూల్స్ ప్రకారం నోట్లు డ్యామేజ్ అయినందుకు, మల్టీలేటెడ్, కంటేమినేటెడ్ బ్యాంక్ నోట్స్‌కు గానూ కొత్త కరెన్సీలో 23 మిలియన్ (19,320 యూఎస్ డాలర్లు) వోన్‌లను అందించామని బ్యాంక్ ఒప్పుకుంది. డ్యామేజ్ ఎక్కువగా ఉండటంతో అన్ని బిల్స్‌ను తాము ఎక్సేంజ్ చేయలేదని ఆఫ్ కొరియాలో పని చేసే అధికారి తెలిపారు. ఎంత మనీని సదరు వ్యక్తి వాష్ చేయడానికి చూశాడనేది తమకు పక్కాగా తెలియదన్నారు. లాస్ అయిన అమౌంట్ మాత్రం ఎక్కువగానే ఉండొచ్చన్నారు.