మెగాస్టార్ చిరంజీవి కొత్తలుక్

కరోనా నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి షూటింగ్ లు లేక ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఆయన సరికొత్త లుక్ తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మీసాలు లేకుండా ఆయన ఈ లుక్ లో కనిపిస్తున్నారు. పదేళ్ల విరామం తర్వాత చిరంజీవి ’ఖైదీ నెంబర్ 150‘తో సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనంతరం ఆయన నటించిన ’సైరా‘ కూడా విజయం సాధించింది. ప్రస్తుతం చిరంజీవి ’ఆచార్య‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మీసం లేకుండా ఉన్న తన లుక్ ను చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ’మేకోవర్ మూడ్స్‘ అని చిరంజీవి కామెంట్ పెట్టారు. ఈ లుక్ లో చిరంజీవి బక్కపలచగా ఉండి యంగ్ హీరోగా కనిపిస్తున్నారు. ఈ సరికొత్త లుక్ మరో కొత్త సినిమా కోసం కావొచ్చని ఆయన అభిమానులు చెబుతున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews