నీలం, జీలం నదులపై ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ముజఫరాబాద్ వాసులు నిరసనలు చేపట్టారు. చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఈ రెండు నదులపై ఆనకట్టల కోసం ఏ చట్టం కింద ఒప్పందం కుదుర్చుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు. అక్రమంగా ఆనకట్టలు నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు.నీలం జీలం, కోహ్లా హైడ్రో పవర్ ప్రాజెక్టులు అక్రమ నిర్మాణాలు అని.. వాటిని ఆపే వరకు అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్, చైనా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులు ఆపే వరకు నిరసనలు కొనసాగుతాయని పీవోకే వాసులు హెచ్చరించారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) కింద పీవోకేలోని జీలం నదిపై హైడ్రో పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం.. చైనాకు చెందిన ఓ కంపెనీ 1,128 మెగావాట్ల జలవిద్యుత్ ప్లాంట్ ను 92.9 బిలియన్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.