చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు వైరస్ ప్రభావానికి వణికిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చైనాపై విమర్శలు చేశారు. ప్రపంచానికి చైనా తీరని నష్టం చేసిందని అన్నారు. కరోనా వ్యాప్తి విషయంలో చైనా గోప్యత పాటించిందని, అందువల్లే ఇప్పుడు ప్రపంచం మొత్తం మహమ్మారితో పోరాటం చేస్తుందని, చైనా వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు. కరోనా విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు చైనానే పూర్తి బాధ్యత వహించాలన్నారు.గతంలో కూడా కరోనా విషయంలో చైనా అనుసరించిన వైఖరిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా చైనా వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ.. అటు హాంకాంగ్ విషయంలోనూ చైనా తీరుని అమెరికాతో పాటు యూకే, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాలు తీవ్రంగా ఎండగట్టాయి.