లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై భారత్‌ను ఇండో అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీహేలి ప్రశంసించారు. ‘టిక్‌టాక్‌తో పాటు చైనా సంస్థలకు చెందిన 59 పాప్యులర్ యాప్‌లపై భారత్ నిషేధం విధించడం శుభ పరిణామం. టిక్‌టాక్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా ఉంది. చైనా దూకుడుకి ఏ మాత్రం తలొగ్గకుండా భారత్ తన చర్యలను కొనసాగిస్తోంది’ అని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.