కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. సినిమా రంగం కూడా కరోనాతో వణికిపోతోంది. గత మూడు నెలలుగా షూటింగ్ లు లేవు. టాకీసులు మూతపడ్డాయి. ఇప్పడు సినీ ప్రముఖులు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కారణంగా భవిష్యత్ లో వచ్చే సినిమాల్లో ముద్దులు , హగ్గులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో తన సినిమాల్లో ఇకపై ముద్దులు, హగ్ లు ఉండవని ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా చెప్పారు. సినిమా రంగంలో రెజీనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో అవకాశాలు తగ్గినప్పటికీ, ప్రస్తుతం ఆమె బిజీగా మారిపోయారు. ఇకపై తాను నటించే సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ చేయనని రెజీనా స్పష్టం చేసింది. ముద్దులు, హగ్స్, శృంగార సన్నివేశాల్లో నటించాలంటే భయమేస్తుందని, అందుకే ముద్దులు, హగ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించింది. భవిష్యత్ లో పరిస్థితులు మారి మంచిగా ఉంటే, అప్పుడు ముద్దులు, హగ్ ల విషయంపై ఆలోచిస్తానని ఆమె తేల్చి చెప్పింది.