ఇటీవల ఇంటి నిర్మాణాన్ని అడ్డ్డుకున్నారనే ఫిర్యాదుపై సినీ నిర్మాత , వైసీపీ నేత ప్రసాద్ వి పొట్లూరి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. ఆ కేసు విచారణకు హాజరవ్వాలని ఆయనకు పోలీసులు గతంలో పోలీసులు నోటీసులు పంపించారు. కానీ ఆయన హాజరుకాకపోవడం తో నేరుగా పోలీసులు పీవీపీ ఇంటికి వెళ్లారు. కాగా ఆయన పోలీసులపైకి తన పెంపుడు కుక్కలను వదిలారు. దాంతో భయాందోళనకు గురైన పోలీసులు బయటికి వచ్చేసారు. ఈ ఘటనపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. విచారణకు వెళితే తమపైకి పెంపుడు కుక్కలను వదిలారని ఎసై హరీష్ రెడ్డి ఫిర్యాదు చేసారు. దాంతో పీవీపీ పై సెక్షన్ 353కింద కేసు నమోదు చేసారు.