పీవీకి భారతరత్న ఇవ్వాలి, అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి స్వయంగా నేనే అందిస్తాను-కేసీఆర్

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతూ శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధానికి అందించనున్నట్లు సీఎం తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మంగళవారం అత్యున్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీ కేశవరావు నేతృత్వంలోని పీవీ శతజయంతి కమిటీ, అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…రాష్ట్ర శాసనసభలో పీవీ నరసింహారావు చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇదేవిధంగా పార్లమెంట్‌లో సైతం పీవీ చిత్రపటం నెలకొల్పాలన్నారు. హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌ ఏర్పాటుకు కేకే నేతృత్వంలో కమిటీ పనిచేయనున్నట్లు చెప్పారు. మెమోరియల్‌ ఏర్పాటుపై కేకే కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయాలన్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, వంగరలో పీవీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోనూ పీవీ కాంస్య విగ్రహన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews