టాప్ లో బ్రెజిల్ ,టాప్ 3 లో భారత్

కరోనా మహామ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 1,83,000కు పైగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటిలో 54,771 కేసులతో బ్రెజిల్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. 36,617 కేసులతో అమెరికా రెండో స్థానంలో, 15,400 కేసులతో భారత్‌ మూడో స్థానంలో ఉన్నది. టెస్టుల సంఖ్య పెరగడం, అధిక సంఖ్యలో వైరస్‌ వ్యాప్తి చెందడం వల్ల ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల్లో నమోదయిన కేసులతో కలుపుకుని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య 87,08,008కు చేరగా.. నిన్న సంభవించిన 4,743 మరణాలతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 4,61,715కు చేరింది. నిన్నటి మరణాల్లో రెండింట మూడొంతుల మరణాలు అమెరికాలోనే సంభవించడం గమనార్హం.స్పెయిన్‌లో అధికారులు మూడు నెలల లాక్‌డౌన్‌ తరువాత జాతీయ అత్యవసర పరిస్థితిని ముగించారు. ఫలితంగా మార్చి 14 నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొదటిసారిగా దేశ వ్యాప్తంగా స్వేచ్ఛగా ప్రయాణించడానికి వీలు కల్పించారు. వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించే బ్రిటన్ సహా 26 యూరోపియన్ దేశాల సందర్శకుల కోసం విధించిన 14 రోజుల క్వారంటైన్‌ నియమాన్ని కూడా రద్దు చేశారు. అయితే ప్రస్తుతం ప్రయాణాలకు ప్రజలకు సుముఖంగా లేరు. ఈ క్రమంలో ‘ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన ఈ స్వేచ్ఛ వల్ల మేం మా కుటుంబాన్ని,స్నేహితులను చూడటానికి వెంటనే ప్రయాణం కావాల్సిన అవసరం లేదు. మరి కొంత కాలం ఎదురు చూస్తాం’ అని ప్రజలు వెల్లడిస్తున్నారు. స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ వైరస్ తిరిగి రాగలదని సెకండ్‌ వేవ్‌ అటాక్‌ చేసే ప్రమాదం ఉందని.. జాగ్రత్తగా ఉండమని ప్రజలను కోరారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews