మరి కొద్ది రోజులలో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ రోజు మెగా వారసురాలు నిహారిక తన సోషల్ మీడియా పేజ్ ద్వారా పెళ్లి చేసుకోబోతున్నాను అని ఇన్‌డైరెక్ట్ హింట్ ఇచ్చే సరికి ఆమె ఎవరిని వివాహం చేసుకుంటుందా అనే చర్చ ఆసక్తికరంగా సాగుతుంది.గుంటూరుకి చెందిన ఓ గవర్నమెంట్ అధికారి కొడుకుని నిహారిక పెళ్లి చేసుకోనుందనే టాక్స్ వినిపిస్తుండగా, నిహారిక పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి ఇతనే అంటూ ఓ ఫోటో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిహారిక ఆ వ్యక్తిని హగ్ చేసుకొని ఫేస్‌ని కవర్ చేసింది. ఇతనే నిహారిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అని నెటిజన్స్ జోస్యాలు చెబుతున్నారు. మరి మెగా అల్లుడు గురించి పూర్తి సమాచారం తెలియాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు.