కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. అమెరికాలో ఇప్పటి వరకు 2.1 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. అమెరికా తరువాత రష్యాలో (1.2 కోట్లు) కరోనా టెస్టులతో రెండో స్థానంలో ఉంది. అమెరికాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1.12 లక్షలకు చేరుకుంది. ప్రపంచంలో దాదాపుగా కరోనా వైరస్ 71 లక్షల మందికి సోకగా నాలుగు లక్షల మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్ లో కరోనా రోగుల సంఖ్య 2.57 లక్షలకు చేరుకోగా ఏడు వేల మంది చనిపోయారు. ఇండియాలో కరోనా నుంచి 1.23 లక్షల మంది కోలుకోగా వివిధ ఆస్పత్రుల్లో 1.26 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. భారత్ లో ఇప్పటి వరకు దాదాపుగా 48 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు. భారత్ లో ఎక్కువ కరోనా టెస్టులు చేస్తే ఎక్కువ కేసులు నమోదవుతాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. కరోనా టెస్టులు కోట్లలో చేస్తే భారత దేశం తొలి స్థానంలో ఉంటుందని వైద్య వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.