ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. కాగా ప్రారంభోత్సవం రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. దీని ప్రకారం ఏప్రిల్ 30న ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంట 20 నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి చేస్తారు. ఆ వెంటనే కొత్త సచివాలయాన్ని కేసీఆర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించి నేరుగా 6 వ అంతస్తులోని తన ఛాంబర్ లో కొలువు తీరనున్నారు. మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 04 నిమిషాల మధ్యకాలంలో సుముహర్తం ఉండటంతో మంత్రులు, ఉన్నతాధికారులు కూడా తమకు కేటాయించిన చాంబర్లలో కొలువుదీరుతారు. ఈ ఆరు నిమిషాల సమయంలో ఒక ఫైల్ మీద సంతకం చేయాలని అధికారులకు, మంత్రులకు జీఏడీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.