చలో రాజభవన్ ఉద్రిక్తత కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

రాహుల్‌ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.ఖైరతాబాద్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లారు. దీంతో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఆందోళనపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకున్న భట్టి విక్రమార్క, ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews